న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఆస్తులు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే. కేరళలోని వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. మళ్లీ అదేస్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను రాహుల్ పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులను రూ. 20 కోట్లుగా రాహుల్ పేర్కొన్నారు. రూ. 9.24 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ. 55 వేల నగదు, రూ.26.25 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు, రూ.4.33 కోట్లు బాండ్లు, షేర్లు, రూ. 3.81 కోట్ల మ్యుచువల్ ఫండ్స్, రూ. 15.21 లక్షల విలువ చేసే గోల్డ్ బాండ్స్, రూ. 4.20 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. రూ. 11.15 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇందులో ఢిల్లీలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లు తెలిపారు.ఈ వ్యవసాయ భూమిలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు వాటా ఉన్నట్లు చెప్పారు. గురుగ్రామ్‌లో ఆఫీసు స్పేస్ కూడా రాహుల్ పేరిట ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ. 9 కోట్లు.
రాహుల్ గాంధీ ఆస్తులు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే..!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఆస్తులు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే. కేరళలోని వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. మళ్లీ అదేస్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను రాహుల్ పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులను రూ. 20 కోట్లుగా రాహుల్ పేర్కొన్నారు. రూ. 9.24 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ. […]

Latest News
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...