ఢిల్లీలో కాలుష్యం మ‌రింత తీవ్రం

దేశ రాజ‌ధానిని కాలుష్యం మ‌రింత క‌ల‌వ‌ర పెడుతున్న‌ది. గాలి నాణ్యత మరింతగా దిగజారింది. ఇప్పుడు "తీవ్రమైన ప్లస్" క్యాట‌గిరీకి దగ్గరగా ఉన్న‌ది.

ఢిల్లీలో కాలుష్యం మ‌రింత తీవ్రం
  • తీవ్రమైన ప్లస్ క్యాట‌గిరీకి గాలి నాణ్యత
  • దీపావ‌ళి త‌ర్వాత మ‌రింత దారుణం



విధాత‌: దేశ రాజ‌ధానిని కాలుష్యం మ‌రింత క‌ల‌వ‌ర పెడుతున్న‌ది. గాలి నాణ్యత మరింతగా దిగజారింది. ఇప్పుడు “తీవ్రమైన ప్లస్” క్యాట‌గిరీకి దగ్గరగా ఉన్న‌ది. మ‌ళ్లీ వాహ‌నాల‌కు స‌రి-బేసి విధానం అమ‌లుచేసే ద‌శ‌కు ప‌రిస్థితి చేరింది. నిత్యం ద‌ట్ట‌మైన పొంగ‌మంచు ఢిల్లీని క‌ప్పేస్తున్న‌ది. ఢిల్లీ గాలి నాణ్యత సూచీ గురువారం ఉదయం 7 గంటలకు 437 వద్ద ఉన్న‌ది. గురువారం సాయంత్రం 4 గంటలకు 419గా మరింత దిగజారింది.


రాజధాని 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI ) ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు నమోద‌వుతుంది. గత వారాంతంలో వర్షం కారణంగా గాలి నాణ్యత క్ర‌మంగా మెరుగుప‌డింది. బుధవారం 401, మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220, శుక్ర‌వారం 279గా న‌మోదైంది. దీపావళి రాత్రి పటాకులు కాల్చ‌డం, స‌మీప రాష్ట్రాల్లో మళ్లీ వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను, వ‌రి కొయ్య‌కాళ్ల‌ను కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయిలు తరువాతి రోజుల్లో పెరిగాయి.


ఈ ప్ర‌తికూల‌ వాతావరణ పరిస్థితులు ప్రధానంగా ప్రశాంతమైన గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల వ్యాప్తికి ఆటంకం కలిగిస్తాయి. పొరుగున ఉన్న ఘజియాబాద్ (374), గురుగ్రామ్ (404), గ్రేటర్ నోయిడా (313), నోయిడా (366), ఫరీదాబాద్ (415)లో కూడా గాలి కాలుష్యంగా తీవ్రంగా న‌మోదువుతున్న‌ది.


0-50 మధ్య ఉన్న AQI మంచిది. 51-100 సంతృప్తికరం, 101- 200 మధ్యస్థం, 201- 300 పేలవం, 301-400 చాలా పేలవం, 401-450 తీవ్రం, 450 కంటే ఎక్కువ తీవ్రమైన ప్లస్‌గా పరిగణిస్తారు. ఈ వారం ప్రారంభంలోAQI 450-మార్క్‌ను దాటితే బేసి-సరి వాహ‌నాల విధానాన్ని తిరిగి అమ‌లుచేస్తామ‌ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.