Floods | కేరళ, అసోం రాష్ట్రాలకు పోటెత్తుతున్న వరదలు.. రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం జలసంఘం

Floods | తుపానుల కారణంగా కేరళ, అసోం రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (CWC) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు వరద పరిస్థితులపై సీడబ్ల్యూసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

  • Publish Date - June 2, 2024 / 06:55 AM IST

Floods : తుపానుల కారణంగా కేరళ, అసోం రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నట్లు కేంద్ర జలసంఘం (CWC) తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు వరద పరిస్థితులపై సీడబ్ల్యూసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. తుపానుల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది.

అరుణాచల్‌ప్రదేశ్‌ మీదుగా ఒక తుపాను బంగాళాఖాతం నుంచి వీస్తున్న బలమైన గాలులతో కలిసి ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, సిక్కింలలో భారీ వర్షాలు కురిపిస్తోంది. దక్షిణ కేరళ తీరంలోని మరో తుపాను కారణంగా కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తున్న నేపథ్యంలో నదులలో నీటిమట్టాలు బాగా పెరుగుతాయని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీతోపాటు పలు రిజర్వాయర్లు, ఆనకట్టల వద్ద పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కేరళలో నైరుతి రుతుపవనాలు తీవ్రతరం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. త్రిసూర్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో ఐఎండీ శనివారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అస్సాంలో వరదల పరిస్థితి భయంకరంగా ఉండగా, 11 జిల్లాల్లోని 3.5 లక్షల మంది ప్రజలపై ఇవి ప్రభావం చూపుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Latest News