న్యూఢిల్లీ : కోల్‌కతాలో ఫుట్‌బాల్ లెజండ్ మెస్సీకి అభిమానులు జన నీరాజనం పలికారు. సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ 70 అడుగుల తన విగ్రహాన్ని షారుక్ ఖాన్‌తో కలిసి వర్చువల్‌గా ఆవిష్కరించాడు. ఈ సందర్బంగా మెస్సీ అభిమానులను పలకరించాడు. మెస్సీని చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. మెస్సీ… మెస్సీ నినాదాలతో లేక్ టౌన్ స్టేడియం మార్మోగిపోయింది. కోల్ కతాలోని ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మోహన్ బగాన్ మెస్సీకి జెర్సీని బహుమతిగా అందించింది.
అనంతరం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలతో మెస్సీ భేటీ అయ్యారు.ఈ సందర్బంగా మెస్సీని సీఎం మమత ఘనంగా సత్కరించారు.
స్టేడియంలో అభిమానుల వీరంగం
కోల్ కతా వచ్చిన మెస్సీ త్వరగా వెళ్లిపోవడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తామంతా ఎంతో కష్టపడి మెస్సీని చూసేందుకు వస్తే..కొద్ది నిమిషాలే స్టేడియంలో ఉండి వెళ్లిపోవడం పట్ల అభిమానులు ఆసంతృప్తికి గురయ్యారు. స్టేడియంలో సీట్లను ధ్వంసం చేశారు. పోలీసులపైకి, అధికారులపైకి వాటర్ బాటిల్స్ విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు.మెస్సీ పర్యటన స్వల్ప సమయానికే పరిమితం చేసి..తమను పిచ్చోళ్లను చేశారని ప్రభుత్వంపైన, నిర్వాహకులపైన అభిమానులు మండిపడ్డారు. అభిమానుల ఆందోళనతో లేక్ టౌన్ స్టేడియంలో గందరగోళం, ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నియంత్రిస్తున్నారు.
కోల్ కతా పర్యటించిన ముగించుకున్న మెస్సీ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడతాడు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
Illegal Aadhaar Centers : అనధికార ఆధార్ సెంటర్లపై అధికారుల దాడులు!
Viksit Bharat Shiksha Adhikshan : ప్రైవేటు విద్యా సంస్థల మూకుతాడుకు
