మెస్సీ నీ దారెటు ..?

విధాత,బార్సిలోనా: ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ.. బార్సిలోనా క్లబ్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడేశాడన్న అనుమానాలు మొదలయ్యాయి. స్పానిష్‌ లీగ్‌ సీజన్‌లో ఈబర్‌తో చివరి మ్యాచ్‌ ఆడకుండా ముందుస్తుగా సెలవులపై వెళ్లిన మెస్సీ మళ్లీ బార్సిలోనా తరఫున బరిలోకి దిగుతాడా అన్నది సందేహంగా మారింది. ఈ ఏడాది జూన్‌ 30తో అతడి కాంట్రాక్టు ముగియనున్నా ఇంత వరకు పొడిగింపుపై ఎలాంటి స్పష్టత రాలేదు. క్లబ్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మెస్సీ గతేడాదే బార్సిలోనాను […]

  • Publish Date - May 22, 2021 / 11:32 AM IST

విధాత,బార్సిలోనా: ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ.. బార్సిలోనా క్లబ్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడేశాడన్న అనుమానాలు మొదలయ్యాయి. స్పానిష్‌ లీగ్‌ సీజన్‌లో ఈబర్‌తో చివరి మ్యాచ్‌ ఆడకుండా ముందుస్తుగా సెలవులపై వెళ్లిన మెస్సీ మళ్లీ బార్సిలోనా తరఫున బరిలోకి దిగుతాడా అన్నది సందేహంగా మారింది.

ఈ ఏడాది జూన్‌ 30తో అతడి కాంట్రాక్టు ముగియనున్నా ఇంత వరకు పొడిగింపుపై ఎలాంటి స్పష్టత రాలేదు. క్లబ్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మెస్సీ గతేడాదే బార్సిలోనాను వీడాలని అనుకున్నా.. కాంట్రాక్టు మధ్యలో వైదొలిగితే లీగల్‌ సమస్యలు వస్తాయని నిలిచిపోయాడు. దీంతో అతడు మళ్లీ బార్సిలోనాతో కాంట్రాక్టు పొడిగించుకుంటాడా లేదా వేరే క్లబ్‌కు వెళతాడా అన్నది చూడాలి. కాగా జూన్‌ 13న ప్రారంభం కానున్న కోపా అమెరికా టోర్నీలో చిలీతో బార్సిలోనా ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఆడతాడని క్లబ్‌ ఆశిస్తున్నది.