విధాత, హైదరాబాద్ : భారత్‌లో తన ‘గోట్ టూర్’ను ముగించుకుని వెళ్లిన ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తనను ఆదరించిన భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘నమస్తే ఇండియా..! ఈ పర్యటనలో నాకు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా పర్యటనలు తనకు నమ్మశక్యం కాని అనుభూతిని ఇచ్చాయని మెస్సీ తన వీడియోలో పేర్కొన్నారు. “మీ ఆత్మీయ స్వాగతం, గొప్ప ఆతిథ్యానికి ధన్యవాదాలు అని.. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అని మెస్సీ తన సందేశంలో ఆశాభావం వెలిబుచ్చారు.
కానరాని రేవంత్ …బీఆర్ఎస్ సెటైర్లు
అయితే మెస్సీ తన భారత్ పర్యటన దృశ్యాలతో విడుదల చేసిన ఈ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. మెస్సీ చుట్టూ తిరుగుతూ, ఏదో పెద్ద ఘనత సాధించినట్టు హడావిడి చేసినా..చివరికి మెస్సీ మాత్రం రేవంత్ రెడ్డిని పూర్తిగా లైట్ తీసుకున్నాడని ఎద్దేవా చేస్తుంది. మెస్సీ ఒక్క నిమిషం వీడియోలో రేవంత్ రెడ్డితో ఉన్న క్లిప్స్, ఆయనతో ఆడిన దృశ్యాలు, మెస్సీకి దగ్గరగా ఉన్న ఫుటేజ్ మాత్రం ఎక్కడా లేకపోవడం చర్చనీయాంశమైంది. సహజంగానే ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణులకు ఇబ్బందికరంగా మారగా..ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఆయుధంగా మారినట్టయ్యింది. మెస్సీ పర్యటనకు రూ.100కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి హడావుడి చేసినప్పటికి..ఆ వీడియోలో ఒక్క క్షణమైనా రేవంత్ రెడ్డి కనిపించకపోవడంపై బీఆర్ఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది.
రేవంత్ రెడ్డి కి చేదు అనుభవం..
మెస్సీ చుట్టూ తిరుగుతూ, ఏదో పెద్ద ఘనత సాధించినట్టు హడావిడి చేసినా… చివరికి మెస్సీ మాత్రం పూర్తిగా లైట్ తీసుకున్నాట్లు తెలుస్తోంది.మెస్సీ తన ఇండియా టూర్‌కు సంబంధించిన అన్ని మూమెంట్స్‌ను కలిపి వీడియో రిలీజ్ చేశాడు.
ఆ వీడియోలో ఒక్క చోట కూడా రేవంత్… pic.twitter.com/xEp4p4fRjr— Telugu Reporter (@TeluguReporter_) December 17, 2025
ఇవి కూడా చదవండి :
Maoist Letter : మావోయిస్టుల అరెస్టులపై సంచలన లేఖ
Bandla Ganesh | సుజీత్‌కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కార్ గిఫ్ట్ .. చర్చనీయాంశంగా మారిన బండ్ల గణేష్ కామెంట్
