విధాత : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం పెద్దదోబలో పోలీసులు 16మంది మావోయిస్టులను అరెస్టు చేయడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట వెలువడిన లేఖలో మావోయిస్టుల అరెస్టులను ఖండిస్తున్నామని, వెంటనే వారిని కోర్టులో హాజరుపరుచాలని జగన్ డిమాండ్ చేశారు. సిర్పూర్ మండలం కకర్ బుడ్డి బాబ్జీపేట గ్రామ పరిసరాల్లో నిరాయుధులుగా సంచరిస్తున్న మావోయిస్టులను 16మందిని అరెస్టు చేశారని, అందులో ఇద్దరు గ్రామస్తులు ఉన్నారని..తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక శాంతియుత వాతావరణాని భగ్నం చేసేందుకు పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం కొద్దిమంది కార్పోరేట్ల ప్రయోజనాల కోసం మావోయిస్టు ముక్త్ భారత్ పేరిట ఆపరేషన్ కగార్ తో ప్రజలపైన, విప్లవోద్యమంపైన యుద్దం చేస్తుందన్నారు. కేంద్రం కొనసాగిస్తున్న కగార్ యుద్దానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వరాదని కోరుతున్నామని తెలిపారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అక్రమ అరెస్టులు కొనసాగకుండా ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేలా..కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని కోరారు.
కాగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో మావోల అరెస్టు కలకలం రేపింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం పంగిడి పంచాయతీ అనుబంధ గూడెం అయిన పెద్దదోబకు 3 కి.మీ దూరంలోని నిర్జన ప్రాంతంలోని ఓ గుడిసెలో 16 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా పసిగట్టిన స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వారిని చుట్టుముట్టింది. ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వారిని అరెస్టు చేసింది. వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 9 మంది మహిళలు, మరో ఏడుగురు పురుషులుగా ఉన్నారని..వారి నుంచి ఏకే 47సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అరెస్టయిన మావోయిస్టులను హైదరాబాద్ కు తరలించారు. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Maoist Letter : మావోయిస్టుల అరెస్టులపై సంచలన లేఖ
Street Dogs Chase Explained | కుక్కలు ఎందుకు వెంటపడుతాయో తెలుసా?
