Sarpanch Oath Ceremony Postponed : నూతన సర్పంచ్ ల బాధ్యతల స్వీకరణ 22కు వాయిదా

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల పదవీ బాధ్యతల స్వీకరణ తేదీని ప్రభుత్వం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. సరైన ముహూర్తాలు లేవన్న విజ్ఞప్తితో ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.

Telangana Sarpanch Oath Ceremony postponed

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిచిన నూతన సర్పంచ్ ల పదవీ బాధ్యతల స్వీకరణ(అపాయింట్ మెంట్ డే) తేదీలో పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మార్పు చేసింది. నూతన సర్పంచ్ ల పదవీ బాధ్యతల స్వీకరణ తేదీని డిసెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీకి వాయిదా వేసింది.

అంతకుముందు నూతన సర్పంచ్ లు డిసెంబర్ 20వ తేదీన పదవీ బాధ్యతల స్వీకరించాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే డిసెంబర్ 20న సరైన ముహూర్తాలు లేనందునా..ఎన్నికైన ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 20వ తేదీకి బదులుగా 22వ తేదీని నూతన సర్పంచ్ ల పదవీ బాధ్యతల తేదీగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అదే రోజున నూతన సర్పంచ్ లు పదవీ బాధ్యతలు స్వీకరించాలని పంచాయతీ రాజ్ శాఖ సవరించిన ఉత్తర్వులలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

Telangana Gram Panchayat Elections : తెలంగాణలో ముగిసిన ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
Google Maps Wrong Navigation : గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కృష్ణా నదిలోకి లారీ!

Latest News