విధాత : గూగుల్ మ్యాప్ లను గుడ్డిగా నమ్ముకుని వాహనదారులు ప్రమాదాల పాలవుతున్న ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. వాహనదారులు గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ఎటువైపు పోతున్నామో కూడా చూసుకోకుండా..నదులు, సముద్రాలు, నిర్మాణంలో ఉన్న వంతెనలపైకి వెళ్లి ప్రమాదాల పాలవుతున్నారు. తాజాగా ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్ముకుని రాత్రి పూట ఏకంగా కృష్ణా నదిలోకి లారీతో వెళ్లిపోయిన ఘటన వైరల్ గా మారింది.
ఆత్మకూరు నుంచి గద్వాల వైపు లారీలో వెలుతున్న డ్రైవర్ బాషా రోడ్డు మార్గం అర్థం కాకపోవడంతో గూగుల్ మ్యాప్‌ని అనుసరించాడు. ఓ చోట టర్న్ మిస్ కావడంతో డ్రైవర్ బాష గమనించుకోకుండా తెల్లవారుజామున నిద్ర మత్తులో గద్వాల మార్గం అనుకుని ఉన్న వనపర్తి జిల్లా జూరాల గ్రామం కృష్ణా నది పుష్కర ఘాట్‌లోకి లారీతో సహా వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు ఎదురుగా నీళ్లు కనిపించడంతో చివరి క్షణంలో లారీని ఆపేయడంతో ప్రమాదం తప్పింది.
అప్పటికే పుష్కర్ ఘాట్ లో సగం వరకు లారీ వెళ్లిపోయింది. స్థానికులు, జేసీబీ సహాయంతో లారీని తిరిగి రోడ్డుపైకి తీసుకువచ్చి సహాయం అందించడంతో బాష తిరిగి తన గమ్యం వైపు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..అది చూసిన నెటిజన్లు గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా అనుసరించే వారికి ఇది హెచ్చరిక అని కామెంట్లు పెడుతున్నారు.
గూగుల్ మ్యాప్స్ నమ్మకంతో నది తీరానికి చేరిన లారీ
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న లారీ డ్రైవర్ బాషా వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం జూరాల వద్ద కృష్ణానది ఘాట్‌కు చేరాడు.
టర్న్ మిస్ కావడంతో నది వైపు వెళ్లగా అప్రమత్తమై వాహనం ఆపడంతో ప్రమాదం తప్పింది.
స్థానికులు, జేసీబీ సహాయంతో… pic.twitter.com/oxCcET2rOM
— ChotaNews App (@ChotaNewsApp) December 17, 2025
ఇవి కూడా చదవండి :
Nabha Natesh | గ్లామర్ షోలో నభా నటేష్ రూటే సపరేటు.. అస్సలు తగ్గేదే లేదండోయ్
Oscar | ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’… భావోద్వేగానికి గురైన కరణ్ జోహార్
