Oscar | ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’… భావోద్వేగానికి గురైన కరణ్ జోహార్

Oscar | దర్శకుడు నీరజ్ ఘాయవాన్ రూపొందించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’ భారత సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఈ సినిమా 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్ 2026) లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కావడం విశేషం. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేఠ్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Oscar | దర్శకుడు నీరజ్ ఘాయవాన్ రూపొందించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’ భారత సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఈ సినిమా 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్ 2026) లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కావడం విశేషం. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేఠ్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ వార్త వెలువడిన వెంటనే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సినిమా టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అకాడమీ నుంచి అధికారిక ప్రకటన

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం నాడు 12 విభాగాల్లో షార్ట్‌లిస్ట్ అయిన సినిమాలు, కళాకారులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించింది. ఇందులో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 15 సినిమాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ 15 చిత్రాల్లో నుంచి చివరకు 5 సినిమాలను తుది నామినేషన్లకు ఎంపిక చేయనున్నారు.

అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయిన చిత్రాలు

‘హోమ్‌బౌండ్’తో పాటు ఈ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయిన సినిమాలు ఇవి:

అర్జెంటీనా – బెలీన్

బ్రెజిల్ – ది సీక్రెట్ ఏజెంట్

ఫ్రాన్స్ – ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్

జర్మనీ – సౌండ్ ఆఫ్ ఫాలింగ్

ఇరాక్ – ది ప్రెసిడెంట్స్ కేక్

జపాన్ – కొకుహో

జోర్డాన్ – ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యు

నార్వే – సెంటిమెంటల్ వ్యాల్యూ

పాలస్తీనా – పాలస్తీనా 36

దక్షిణ కొరియా – నో అదర్ ఛాయిస్

స్పెయిన్ – సిరాత్

స్విట్జర్లాండ్ – లేట్ షిఫ్ట్

తైవాన్ – లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్

ట్యునీషియా – ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్

జనవరి 22న తుది నామినేషన్లు

ఈ షార్ట్‌లిస్ట్ నుంచి తుది నామినేషన్లను జనవరి 22, 2026న ప్రకటించనున్నారు. ఆస్కార్ 2026 అవార్డ్స్ వేడుక‌కి ప్రముఖ హాస్య నటుడు కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించనుండగా, అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15, 2026న జరగనుంది.

కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్

‘హోమ్‌బౌండ్’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ కావడంపై కరణ్ జోహార్ స్పందిస్తూ.. “హోమ్‌బౌండ్ ప్రయాణం ఎంత గర్వంగా, సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈ చిత్రాన్ని ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చూడటం మా అందరికీ గర్వకారణం. నీరజ్… మా కలలను నిజం చేసినందుకు ధన్యవాదాలు. కాన్స్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్ వరకు ఇది అద్భుతమైన ప్రయాణం. నటీనటులకు నా ప్రేమ. ‘హోమ్‌బౌండ్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది” అని పేర్కొన్నారు.

ధర్మ మూవీస్ హర్షం

కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ మూవీస్ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ఘనతపై సంతోషం వ్యక్తం చేసింది. ‘హోమ్‌బౌండ్’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ కావడం భారతీయ సినిమాకు మరో గొప్ప మైలురాయిగా సంస్థ పేర్కొంది. మొత్తానికి… ‘హోమ్‌బౌండ్’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం భారత చిత్ర పరిశ్రమకు మరో గర్వకారణంగా మారింది. తుది నామినేషన్‌కు ఎంపిక అవుతుందా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో నెలకొంది.

Latest News