రాష్ట్రపతి భవన్‌లో పులి సంచారం.. కొనసాగుతున్న సస్పెన్స్‌

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అనేక మంది దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరుత పులి లాంటి జంతువు సంచారం చర్చనీయాంశమైంది.

  • Publish Date - June 10, 2024 / 03:15 PM IST

విధాత, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అనేక మంది దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరుత పులి లాంటి జంతువు సంచారం చర్చనీయాంశమైంది. ఎంపీ దుర్గాదాస్ ప్రమాణం చేస్తుండగా ఆయన వెనుక భాగంలోని భవనం కారిడార్ ప్రాంతంలో చిరుత పులి వంటి జంతువు సంచారం వీడియోల్లో కనిపించింది. అయితే ఆ జంతువు ఏమిటి..అది అక్కడ ఎలా స్వేచ్చగా తిరుగుతుందన్న ఆసక్తి అందరిలోని రేకెత్తింది.

ఇది పెంపుడు జంతువా? పిల్లా? లేక చిరుత అక్కడ ప్రవేశించిందా? అనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రధాని సహా 72మంది మంత్రుల బృందం ప్రమాణా స్వీకారం రెండు మూడు గంటల పాటు సాగింది. అంత సుదీర్ఘ సమయం ఆ జంతువు రాష్ట్రపతి భవన్‌లో అంత ప్రశాంతంగా సంచరిస్తూ ఎటు వెళ్లింది..ఇంతకూ ఆ జంతువు ఏమిటన్న ప్రశ్న ఆ వీడియో చూసిన వారందరి మెదళ్లను తొలిచేస్తుంది. మరికొందరు నెటిజన్లు రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులులను పెంచుతున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest News