Site icon vidhaatha

Dress Code Mandatory for School Stafff | భలే ఉంది బాసూ.. టీచర్లకూ యూనిఫారమ్​..!

చండీగఢ్‌, జూలై 1: చండీగఢ్​లో​ పంతుళ్లు కూడా ఇకనుండి యూనిఫారమ్​ ధరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, హెడ్​మాస్టర్లు(Teachers and Prncipals) ఇకపై వారానికి ఒక్కరోజు నిర్దిష్టంగా నిర్ణయించిన డ్రెస్​కోడ్(Dress Code)​ను పాటించాల్సి ఉంటుంది. చండీగఢ్ విద్యా శాఖ తాజా ఉత్తర్వుల(Chandigarh Education dept) ప్రకారం, ప్రతి సోమవారం రోజు ఇది తప్పనిసరిగా అమలులో ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఇది దేశంలో తొలి ప్రయోగంగా చెబుతున్నారు.

విద్యా శాఖ విడుదల చేసిన అధికారిక సర్క్యూలర్‌లో, ఉపాధ్యాయుల పరిపాలనా విధానంలో ఏకరూపత  తీసుకురావడం, వృత్తిపరమైన గౌరవాన్ని పెంపొందించడం, ప్రత్యేక గుర్తింపును కల్పించడం ముఖ్య ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం కొంత మంది ఉపాధ్యాయులకు నచ్చకపోవడంతో,  కొంతమేర మార్పులు చేసి తెచ్చిన నిబంధన అని సమాచారం. ప్రతీరోజు ధరించాలనే నిబంధనను వారానికొక్క రోజుగా మార్చారట.

నిర్ధారించిన డ్రెస్కోడ్ విధానాలు ఇలా ఉన్నాయి:

ఉత్తర్వుల ప్రకారం, ప్రతి సోమవారం రోజు  అందరు ఉపాధ్యాయులు ఈ వేషధారణ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల సిబ్బందికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనీ, ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదనీ ఉత్తర్వుల్లో పేర్కొనబడింది.

ఈ చర్య ద్వారా ఉపాధ్యాయుల్లో ఏకతత్వాన్ని ఏర్పరచడం, విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలిచేలా చేయడం ముఖ్య లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలలో పారదర్శకత, సమగ్రత కలిగించాలన్న ఉద్దేశంతో విద్యా రంగంలో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

 

Exit mobile version