విధాత: చండీఘడ్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పరామర్శించారు. పూరణ్ కుమార్ భార్య అమ్నీత్ ఐఏఎస్ ను ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడించారు. దేశంలోని అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారికే సామాజిక న్యాయం దక్కని పరిస్థితుల్లో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చండీగఢ్ చీఫ్ సెక్రటరీ రాజేష్ ప్రసాద్ ను భట్టి ప్రశ్నించారు. పూరణ్ కుమార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
కాగా పూరణ్ కుమార్ ఈ నెల 7న తన అధికారిక నివాసంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివిక్ష, అధికారుల నుంచి మానసికహింస, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో తనపై వివక్ష వంటి కారణాల మూలంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొ్న్నారు.
Bhatti Vikramarka : ఐపీఎస్ పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు భట్టి పరామర్శ
చండీగఢ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. సామాజిక న్యాయంపై సీఎస్‌ను ప్రశ్నించారు.
