Toll Plaza | దేశవ్యాప్తంగా ఏడాదిలోపు టోల్‌ప్లాజాలు మాయం!

దేశవాప్యంగా జాతీయ రహదారులపై ఏడాదిలోపు అన్ని టోల్‌ప్లాజాలు ఎత్తివేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దాని స్థానంలో కొత్తగా ఎలక్ట్రానిక్‌ టోల్‌ విధానాన్ని తీసుకువస్తున్నామని లోక్‌సభకు చెప్పారు.

end of toll plazas new electronic distance based collection

Toll Plaza | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉపయోగపడే విధంగా రూ.3వేలు వార్షిక ఫీజు సౌకర్యాన్ని ప్రారంభించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. మరో శుభవార్త చెప్పారు. దేశంలో ఏడాదిలోగా టోల్‌ప్లాజా విధానాన్ని తీసివేస్తున్నామని తెలిపారు. దాని స్థానంలో కొత్తగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ తీసుకువస్తున్నామని చెప్పారు. గురువారం నితిన్ గడ్కరీ లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పది ప్రాంతాల్లో నూతన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని, దేశ వ్యాప్తంగా ఏడాది లోపే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కొత్త విధానం అమల్లోకి వస్తే జాతీయ రహదారులపై వాహనదారులు ఆగాల్సిన అవసరం ఉండదని, ఎంత దూరం ప్రయాణం చేస్తే అంతే మొత్తం టోల్ వసూలు చేస్తారని గడ్కరీ తెలిపారు. దీని కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానాన్ని డిజైన్ చేసిందని ఆయన వివరించారు. ఇది ఆర్ఎఫ్ఐడీ విధానంతో పనిచేస్తుందని, టోల్ ఎంత తీసుకున్నారనేది కారులో ఉండే స్ర్కీన్ పై చూసుకునే వెసులుబాటు కల్పించారన్నారు.

జాతీయ రహదారులపై ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించేందుకు ఫుల్ హెచ్.డీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాటిలైట్ విధానం తో వాహనాల కదలికలను గుర్తించి టోల్ వేస్తారన్నారు. యజమాని ఖాతాతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు మెస్సేజ్ లు వస్తాయన్నారు. టోల్ ఫ్లాజాల మూలంగా దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, కొత్త విధానం అమల్లోకి వస్తే అడ్డంకులు లేకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. గతంలో మాదిరి ముప్పై నలభై కిలోమీటర్లకు ఒకేసారి టోల్ వేసే వారని, ఇకముందు ఆ పరిస్థితి ఉండదన్నారు. ఎంత దూరం ప్రయాణిస్తే అంతే దూరం టోల్ వసూలు చేస్తారని తెలిపారు. వాహన యజమాని ఫాస్టాగ్ స్టిక్కర్ పనిచేయనట్లయితే ఈ నోటీసులు పంపిస్తారని, అదనంగా చెల్లింపులు ఉంటాయని తెలిపారు. దేశంలో రూ.10 లక్షల కోట్ల వ్యయంతో 4,500 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ వివరించారు.

Read Also |

Eetala Rajender | ఢిల్లీలో వందలకొద్దీ విమానాలు రద్ధు, ఆలస్యంపై లోక్‌సభలో లేవనెత్తిన ఎంపీ ఈటల రాజేందర్
Two Years Congress Ruling |  23 నెలల కాంగ్రెస్ పాలన.. 2.5 లక్షల కోట్లు అప్పులు! బకాయిదారులకు మొండి చెయ్యే!!
Elephant Pushes Policeman : భక్తులకు నాకు మధ్య నువ్వేంది..పోలీసును ఎత్తిపడేసిన ఏనుగు

Latest News