Goa | గోవా ప్రమాద రెస్టారెంట్ యజమాని చేతిలో 42 షెల్ కంపెనీలు

Goa | గోవాలో రోమ్ లేన్ లో బిర్క్ రెస్టారెంట్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ రెస్టారెంట్ యజమానుల చేతిలో 42 షెల్ కంపెనీలు ఉన్నట్లు తేలడంతో గోవా పోలీసులు అవాక్కయ్యారు.

Goa | గోవాలో రోమ్ లేన్ లో బిర్క్ రెస్టారెంట్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ రెస్టారెంట్ యజమానుల చేతిలో 42 షెల్ కంపెనీలు ఉన్నట్లు తేలడంతో గోవా పోలీసులు అవాక్కయ్యారు. సౌరభ్ లూత్రా, గౌరవ్ లూథ్రా లు ఢిల్లీ నార్త్ వెస్ లోని ఒక అడ్రస్ లో గత రెండేళ్ల వ్యవధిలో 42 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. రోమియో లేన్ లోని బిర్క్ నైట్ క్లబ్ లో సౌరభ్, గౌరవ్ లు సహ యజమానులు గా వ్యవహరిస్తున్నారు. ప్రమాద ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇద్దరూ దేశం విడిచి థాయ్ ల్యాండ్ కు పారిపోయారు. వీరిని వెనక్కి రప్పించి విచారించేందుకు గోవా పోలీసు శాఖ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నది. వారు కచ్చితంగా ఎక్కడ ఉన్నది తెలుసుకున్న తరువాత బ్లూ కార్నర్ నోటీసు జారీ కానున్నది. నోటీసు జారీ చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న దేశం నుంచి మరో దేశానికి వెళ్లే అవకాశం ఉండదని, పట్టుకుని వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశం లభిస్తుందని ఒక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నైట్ క్లబ్ లో ఆదివారం అర్థరాత్రి జరగ్గా, సోమవారం నాడు ఉదయం 5.30 గంటలకు గోవా నుంచి ఇండిగో ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లిపోయారు. నిందితులను పరస్పరం మార్చుకునేందుకు థాయ్ ల్యాండ్, భారతదేశం మధ్య 2015 లో ఒప్పందం జరిగిందని, నైట్ క్లబ్ యజమానులను కచ్చితంగా ఆ దేశం నుంచి గోవాకు తీసుకువచ్చి శిక్షిస్తామని సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. యూకే పౌరసత్వం కలిగిన ఎన్ఆర్ఐ సురీందర్ కుమార్ ఖోస్లా నుంచి భవనాన్ని నైట్ క్లబ్ యజమానులు అద్దెకు తీసుకున్నారని, ఆయన కోసం లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశామని డీఐజీ వర్షా శర్మ వెల్లడించారు. సీజీఎం రాజీవ్ మోదక్, జీఎం వివేక్ సింగ్, మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్స్ ఠాకూర్, భరత్ కోహ్లీలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. థాయ్ ల్యాండ్ కు పారిపోయిన నిందితులను వెనక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ, ఇంటర్ పోల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. న్యూఢిల్లీ రీజినల్ పాస్ పోర్టు అధికారులు కూడా నైట్ క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లకు గైర్హాజరు నోటీసులు జారీ చేసి, వారం రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలని, లేదంటే పాస్ పోర్టు రద్ధవుతుందని హెచ్చరించారు.

Latest News