Goa | పనాజీ : గోవాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నార్త్ గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్ బై రోమియో లైన్ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలింది. దీంతో క్లబ్‌లో ఉన్న 23 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 23 మందిలో నలుగురు పర్యాటకులు కాగా, మిగతా వారంతా నైట్ క్లబ్ సిబ్బంది అని గోవా ప్రభుత్వం తేల్చింది. ప్రమాదం చోటు చేసుకున్న నైట్ క్లబ్ గోవా రాజధాని పనాజీకి 25 కి.మీ. దూరంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరమే ఈ నైట్ క్లబ్‌ను ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అగ్నిప్రమాదానికి గల కారణం సిలిండర్ పేలడమే అని పోలీసులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది. ఇక స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ నైట్ క్లబ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఎం పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైట్ క్లబ్‌కు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది దురదృష్టకరమైన ఘటన అని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రకటించారు.
Today is a very painful day for all of us in Goa. A major fire incident at Arpora has taken the lives of 23 people.
I am deeply grieved and offer my heartfelt condolences to all the bereaved families in this hour of unimaginable loss.
I visited the incident site and have…
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) December 6, 2025
