Bala Krishna | గోవాలో బాల‌య్య చేసిన ప‌నికి ఉలిక్కిప‌డ్డ శ్రీలీల‌.. ఇలా అయితే ఎలా ?

Bala Krishna | గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) వేదికపై నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సత్కారం లభించింది. నటుడిగా ఐదు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించారు.

Bala Krishna | గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) వేదికపై నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సత్కారం లభించింది. నటుడిగా ఐదు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార–ప్రసార శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణకు శాలువా కప్పి ప్ర‌త్యేక గౌరవం అందించారు.

వేదికపై బాలయ్య ప్రత్యేక స్వాగ్ – కళ్లజోడు స్టెప్ వైరల్

సత్కార కార్యక్రమం అనంతరం బాలకృష్ణ తనదైన స్టైల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. నటి శ్రీలీలతో కలిసి స్టేజ్‌పై నిల్చున్న సమయంలో, బాలయ్య అకస్మాత్తుగా తన కళ్లజోడును గాల్లోకి విసిరి స్టైలిష్‌గా పట్టుకున్నారు. ఊహించ‌ని ఈ క్షణం అక్కడున్న వారిని, శ్రీలీలను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. “బాలయ్య స్వాగ్ అంటే ఇదే” అంటూ అభిమానులు వరుసగా కామెంట్లు పెడుతున్నారు.

బాలయ్యకు స్టైల్ మేనరిజమ్స్ కొత్తేమీ కాదు

ఈ తరహా స్టైలిష్ యాక్షన్స్ బాలకృష్ణకు సర్వసాధారణం. గతంలో కూడా పలు ఈవెంట్లలో మైక్‌, ఫోన్‌ను గాల్లోకి విసిరి తన మాస్ ఎనర్జీని చూపించడం బాలయ్యకే ప్రత్యేకం. అరవై ఏళ్ల వయస్సులో కూడా అదే ఉత్సాహంతో కుర్ర హీరోలకు తగ్గకుండా సినిమాలు చేయడం ఆయనకున్న ప్రత్యేక గుర్తింపు.

ఇఫీ వేడుకలు ఈ నెల 28 వరకు

గత రాత్రి ప్రారంభమైన ఇఫీ వేడుకలకు అనుపమ్ ఖేర్, దిల్ రాజు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముగింపు రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా సత్కరించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ 50 ఏళ్ల సినీ జర్నీని పూర్తి చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ర‌జ‌నీకాంత్‌కి కూడా ప్ర‌త్యేక గౌరవం ద‌క్క‌నుంది.

Latest News