Site icon vidhaatha

జేడీఎస్‌లో బీజేపీ పొత్తు ముసలం.. రాష్ట్ర కార్యవర్గం రద్ధు

విధాత : బీజేపీతో పొత్తు జేడీఎస్‌లో ముసలం రేపింది. బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం నాయకత్వంలోని తిరుగుబాటు వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ఆధినేత దేవేగౌడ ఉత్తర్వులు జారీ చేశారు. పనిలో పనిగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తిగా రద్ధు చేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారమే ఇబ్రహీంను తొలగించినట్లు దేవేగౌడ తెలిపారు. కొత్త శాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా తన కుమారుడు హెచ్‌డి కుమారస్వామిని నియమించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జేడీ(ఎస్‌) నిర్ణయించింది.


అయితే పార్టీ నిర్ణయాన్ని ఇబ్రహీం వ్యతిరేకించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్) మధ్య పొత్తు వద్దని డిమాండ్‌ చేశారు. ఈ నెల 16న తనతో మద్దతుదారులతో సమావేశమై పార్టీపై తిరుగుబాటు ప్రకటించి, తన నేతృత్వంలోని పార్టీయే అసలైందని ప్రకటించారు. బీజేపీ పొత్తుతో ఎదురయ్యే పరిణామాలపై పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంను పార్టీ నుంచి దేవేగౌడ తొలగించారు. జేడీ(ఎస్‌) రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని పార్టీ రాష్ట్ర శాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.

Exit mobile version