Deve Gowda | లొంగిపో.. లేదంటే నా ఆగ్రహానికి గురికాక తప్పదు: దేవేగౌడ్‌

కర్ణాటక సెక్క్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ ట్విటర్‌ వేదికగా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు

  • Publish Date - May 23, 2024 / 06:40 PM IST

మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు దేవేగౌడ్‌ వార్నింగ్‌

విధాత: కర్ణాటక సెక్క్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ ట్విటర్‌ వేదికగా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఎక్కడున్నా వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదంటూ ఎక్స్‌ వేదికగా గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ‘ప్రజ్వల్‌ రేవణ్ణకు ఇదే నా హెచ్చరిక’ పేరుతో ఓ లేఖను కూడా పోస్టుకు జతచేశారు. నా సహనాన్ని పరీక్షించొద్దు. ఎక్కడున్నా వెంటనే భారత్‌కు తిరిగి రావాలని, పోలీసుల ఎదుట లొంగిపోయి చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సిందిగా.. ప్రజ్వల్‌ను నేను హెచ్చరిస్తున్నాను. లేదంటే నా ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది’ అని దేవె గౌడ ఎక్స్‌లో పేర్కొన్నారు.

మే 18న స్థానిక ఆలయానికి వెళ్లినప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి మీడియాతో మాట్లాడినట్లు దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజ్వల్‌ చేసిన పని తనకు, తన కుటుంబానికి, సహచరులను, స్నేహితులను, పార్టీ కార్యకర్తలను షాక్‌కు గురిచేసినట్లు చెప్పారు. దాన్నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు. అతని ఫారెన్‌ ట్రిప్‌కు సంబంధించిన సమాచారం తనకు పూర్తిగా తెలియదని దేవెగౌడ పేర్కొన్నారు. ఏది ఏమైనా వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నారు. ఇది విజ్ఞప్తి కాదని, ఇది ప్రజ్వల్‌కు తాను చేస్తున్న హెచ్చరిక అని లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.

Latest News