IMD rain alert | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అలర్ట్‌ జారీచేసిన ఐఎండీ

IMD rain alert | రానున్న వారం రోజులపాటు వాయవ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్, లడఖ్‌, గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Publish Date - July 5, 2024 / 08:19 AM IST

IMD rain alert : రానున్న వారం రోజులపాటు వాయవ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్, లడఖ్‌, గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో ఈ వారం మొత్తం భారీ వర్షాలు కురవనున్నాయి. జూలై 5న జమ్మూ డివిజన్, హిమాచల్‌ప్రదేశ్, 5 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్, 5న పంజాబ్, 5, 6 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారవ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జూలై 5న బీహార్‌లో భారీ వర్షాలు, జూలై 6 వరకు పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురివనున్నాయి.

జూలై 6న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని.. జూలై 6, 7 తేదీల్లో అసోం, మేఘాలయ, 7న ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జూలై 5న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, లక్షద్వీప్, కోస్తా కర్ణాటక, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, ఇంటీరియర్ కర్ణాటకలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కోస్తాంధ్రా తెలంగాణలో ఈ నెల 7, 8వ తేదీల్లో, కోస్తా కర్ణాటకలో 8వ తేదీన, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో జూలై 5న వర్షాలు కురుస్తాయి. 4 నుంచి 6 వరకు గోవాలో, 4 నుంచి 8 వరకు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, 4 నుంచి 7 వరకు కోస్తా కర్ణాటక, 4, 6, 7 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా రెండు రోజులు ముందే దేశంలోకి ప్రవేశించినా జూన్ నెలలో వర్షపాతం ఎక్కువగా కనిపించలేదు. సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. ఇక జూలైలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఎల్నీనో కారణంగా గత ఏడాది వర్షాలు సరిగ్గా పడలేదు. వ్యవసాయంతోపాటు అనేక నగరాల్లో నీటి కొరత కనిపించింది.

Latest News