కిర్రాక్‌ కేజ్రీవాల్‌.. ఆ పుస్తకం చదువుకుంటానని కోర్టుకు వినతి

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ లిక్కర్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగియడంతో ఆయనను సోమవారం ఏప్రిల్ 1న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది

  • Publish Date - April 2, 2024 / 09:40 AM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ లిక్కర్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగియడంతో ఆయనను సోమవారం ఏప్రిల్ 1న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ లిక్కర్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగియడంతో ఆయనను సోమవారం ఏప్రిల్ 1న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. దానితో కోర్టు కేజ్రవాల్‌ను 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను గట్టి భద్రత నడుమ తీహార్‌ జైలుకు తరలించారు. జైలుకు వెళ్ళేముందు కేజ్రీవాల్ స్పెషల్ రిక్వెస్ట్ కింద అప్లికేషన్‌ను తన న్యాయవాది ద్వారా కోర్టు ముందు ఉంచారు. తనకు జైల్లో చదువుకునేందుకు, రామాయణం, భగవద్గీతతోపాటు.. జర్నలిస్ట్ నీరజా చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలు కావాలని, వాటిని జైల్లో తనకు అందుబాటులో ఉంచాలని కోరారు.

వీటితో పాటు ఇంకా జైల్లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, తన రెగ్యులర్ డైట్ ప్రకారం ఆహారం అందించాలని తన విజ్ఞప్తి చేశారు. తన ఒంటిపై ఉన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కూడా అందులో కోరారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ విచారణకు సరిగా సహకరించలేదని ఈడీ అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ సమయంలో అతని ఫోను, ఇతర డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని, కానీ వాటి పాస్‌వర్డ్‌ను కేజ్రీవాల్ చెప్పడం లేదని తెలిపింది. కేజ్రీవాల్‌ను దాదాపు పది రోజులపాటు ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ప్రతిరోజూ ఐదు గంటలకు పైగా, ఇప్పటి వరకు 50 గంటల పాటు విచారించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.

Latest News