Manipuri bridal look Viral| మణిపురి మయూరి సౌందర్యం..చూడతరమా!

మణిపూర్ వివాహాలలో సాంప్రదాయ పెళ్లి దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఓ వివాహంలో సాంప్రదాయ మణిపురి పెళ్లి దుస్తులను ధరించిన వధువు లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న వీడియో వైరల్ గా మారింది.

విధాత : విభిన్న జాతులు..సంస్కృతుల సమ్మిళత సమున్నత వైభవం భారత దేశం. దక్షిణ, ఉత్తర..ఈశాన్య రాష్ట్రాలలో భిన్న సంస్కృతులు..సాంప్రదాయాలు..ప్రజల జీవన శైలులు ఎంతో ప్రత్యేకమైనవే కాకుండా.. ఉన్నతమైనవిగా విరాజిల్లుతున్నాయి. ఉత్కృష్ట సాంస్కృతిక వారసత్వంలో మణిపూర్( Manipur)రాష్ట్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రాష్ట్ర ప్రజల వేష భాషలు..జీవన శైలీతో పాటు వారి సాంస్కృతిక(Cultural Heritage) సంపదలో కీలకమైన మణిపురి నాట్యం ఎంతో ఖ్యాతిగాంచింది.

మణిపూర్ వివాహాలలో(Manipuri  wedding) సాంప్రదాయ పెళ్లి దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఓ వివాహంలో సాంప్రదాయ మణిపురి పెళ్లి దుస్తులను ధరించిన వధువు(bridal look Viral)  లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న వీడియో వైరల్ గా మారింది. అత్యంత అద్బుత ఆభరణాలతో బంగారు మయంగా రూపొందించిన దుస్తులను ధరించిన ఆ మహిళ.. నడుస్తున్న లక్ష్మీదేవిలా కదలాడుతూ అబ్బుర పరిచింది.

ఆమె నిర్మలమైన దేదీప్యమానమైన రూపం…ఈశాన్య భారతదేశ వివాహ సంప్రదాయాల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె రూపం రాజరిక, దైవిక కళతో పాటు మణిపురి సంప్రదాయపు వైభవానికి ప్రతీకగా ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు.

 

Latest News