ఒడిస్సా సీఎం రేసులో పూజారి.. అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి పయనం

ఒడిస్సా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 147స్థానాలకుగాను 78స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది.

  • Publish Date - June 9, 2024 / 06:20 PM IST

విధాత : ఒడిస్సా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 147స్థానాలకుగాను 78స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. వరుసగా రెండున్నర దశాబ్ధాల పాటు ఒడిస్సాను పాలించిన సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. సీఎం ఎవరనే అంశంపై బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, దీనిపై ఉత్కంఠ వీడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందేనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శనివారం పేర్కొన్నారు. దీనిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఒడిస్సా సీఎం రేసులో ఉన్న సంబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఎంపీ ప్రతాప్ సారంగి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ, వైద్యనాథ్ జై పాండే, మాజీ కేంద్ర మంత్రి, గిరిజన నేత ఎంపీ జువల్ ఓరమ్‌, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాంజీ, పూరి ఎంపీ సంబిత్ పాత్రల పేర్లు రేసులో ఉన్నాయి. తాజాగా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లారు. 2019 ఎన్నికల్లో బాస్గడ్ లోక్‌సభ స్థానం నుంచి పుజారీ గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజారాజ్నాగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. ప్రధాని మోదీ ఫ్రమాణ స్వీకారం తర్వాతా ఈ నెల 12న ఒడిస్సాలో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

 

 

Latest News