న్యూఢిల్లీ : త్వరలో ఎన్నికలు జరుగునున్న మూడు రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు బీజేపీ పార్టీ అధిష్టానం ఎన్నికల ఇంచార్జిలను నియమించింది. బీహార్ ఎన్నికల ఇంచార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను నియమించింది. అలాగే కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలను సహాయ ఇంచార్జిలు నియమించింది. సీఆర్ పాటిల్ ప్రస్తుతం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగానూ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇంచార్జిగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్‌ను సహాయ ఇంచార్జిగా నియమించింది. తమిళనాడుకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాను ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. మురళీధర్ మొహోల్‌ను సహాయ ఇంచార్జిగా నియమించారు.
బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియ్యనుండగా..నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరగొచ్చని..ఆక్టోబర్ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.