Sharmishta: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి బెయిల్ ఇచ్చేందుక కోల్ కతా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ఠ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని కించపరుస్తూ వీడియోలు పెట్టారు. దీంతో బెంగాల్ పోలీసులు అమె మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
దీంతో బెయిల్ మంజూరు చేయాలంటూ శర్మిష్ఠ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖుల చేశారు. విచారించిన న్యాయస్థానం శర్మిష్ఠకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా ఓ హద్దు ఉంటుందని .. ఇష్టారాజ్యంగా మాట్లాడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోకతప్పదని న్యాయస్థానం పేర్కొన్నది.
మతపరమైన భావోద్వేగాలతో ముడి పడి ఉన్న అంశాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోర్టు సూచించింది. సోషల్ మీడియాలో వీడియో వచ్చినట్టు, ఒక వర్గం ప్రజల మనోభావాలను గాయపరిచినట్టు విన్నాం’ అని జస్టిస్ పార్ధసారధి చటర్జీ పేర్కొన్నారు.