Site icon vidhaatha

ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోండి.. కర్ణాటక సీఎంకు రాహుల్‌గాంధీ లేఖ

విధాత, హైదరాబాద్ : సెక్క్ స్కాండల్‌లో ఇరుక్కున్న జేడీఎస్ సిటింగ్ ఎంపీ, హసన్ ఎంపీ అభ్యర్థ ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రజ్వల్ రేవన్నపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందించాలని లేఖలో రాహుల్‌గాంధీ పేర్కోన్నారు. మరోవైపు సెక్స్ స్కాండల్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ కోసం కర్ణాటక పోలీసులు ఇవాళ రెండో లుకౌట్ నోటీసు జారీ చేశారు.

ప్ర‌జ్వ‌ల్‌తో పాటు ఆయ‌న తండ్రి హెచ్‌డీ రేవ‌ణ్ణ కోసం కూడా లుకౌట్ నోటీసు ఇచ్చిన‌ట్లు క‌ర్నాట‌క హోంమంత్రి జీ. ప‌ర‌మేశ్వ‌ర తెలిపారు. హ‌స‌న్ ఎంపీ ప్ర‌జ్వ‌ల్‌, హోలెన‌ర‌సిపుర్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవ‌ణ్ణ‌పై న‌మోదు అయిన లైంగిక వేధింపుల కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారిస్తున్న‌ది. శుక్ర‌వారం మ‌రో మ‌హిళ కూడా ఫిర్యాదు చేయ‌డంతో ఆ ఇద్ద‌రిపై ఐపీసీ సెక్ష‌న్ 376 కింద రేప్ కేసును బుక్ చేశారు.

Exit mobile version