విధాత : వెండి, బంగారం(Silver, Gold price) ధరలు మరోసారి పరుగు లంఘించుకున్నాయి. వెండి ధరలకైతే పగ్గాలు లేకుండా(Silver price record high) దూసుకెలుతుంది. సోమవారం కిలో వెండి ధర రూ.5000పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.2,31,000కు చేరింది. వెండి దూకుడు చూస్తుంటే వచ్చే ఏడాది జనవరిలోనే రూ.2,50,000వేలకు చేరిన అశ్చర్యం లేదంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో వెండిపై పెరిగిన పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ లో పెరిగిన వినియోగం, తరిగిన వెండి ఉత్పత్తుల నేపథ్యంలో వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే డిసెంబర్ 13న వెండి కిలో ధర రూ.2,10,000ఉండటం గమనార్హం.
పెరిగిన బంగారం ధరలు
పసిడి ధరలు కూడా సోమవారం పెరుగుదల బాట పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,100పెరిగి రూ.1,35,280కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1000 పెరిగి రూ.1,24,000లకు చేరింది. పసిడి ధరలు కూడా మరింత పెరుతాయంటున్నారు నిపుణులు.
