Dogs Vs Leopard | చిరుత పులిని త‌రిమికొట్టిన గ్రామ సింహాలు.. వీధి కుక్క‌ల తెగువ‌పై ప్ర‌సంశ‌ల జ‌ల్లు

Dogs Vs Leopard | అర్ధ‌రాత్రి వేళ చ‌ల్ల‌ని గాలికి హాయిగా నిద్రిస్తున్న ఓ వీధి కుక్క‌( Street Dog )పై చిరుత పులి( Leopard ) దాడి చేసింది. తోటి కుక్క ప్రాణ‌పాయ స్థితిలో ఉంద‌ని గ‌మ‌నించిన మిగ‌తా కుక్క‌లు( Dogs ).. చిరుత‌పులిపై వీరోచిత పోరాటం చేసి.. త‌రిమికొట్టాయి.

Dogs Vs Leopard | చిరుత పులులు( Leopards ).. త‌మ‌ కంటికి క‌నిపించిన జంతువు( Animal )ను వేటాడి చంపే వ‌ర‌కు విశ్ర‌మించ‌వు. జంతువుల‌నే కాదు మ‌న‌షుల‌ను( Man ) కూడా చిరుత‌లు వెంబడించి వేటాడుతాయి. అంత‌టి భ‌యంక‌ర‌మైన ఓ చిరుత పులి( Leopard )తో గ్రామ సింహాలు( Village Lions ) భీక‌ర‌మైన పోరాటం చేశాయి. చివ‌ర‌కు చిరుత‌ను వీధి కుక్క‌లు( Street Dogs ) త‌రిమికొట్టాయి.

ఉత్త‌రాఖండ్‌( Uttarakhand )లోని హ‌రిద్వార్( Haridwar ) న‌గ‌రం అది. అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యం అవుతుంది. న‌డిరోడ్డుపై వీధి లైట్( Street Light ) కింద ఓ శున‌కం( Dog ) గాఢ నిద్ర‌లో ఉంది. ఉన్న‌ట్టుండి ఓ చిరుత( Leopard ) అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక గాఢ నిద్ర‌లో ఉన్న కుక్క‌పై చిరుత పంజా విసిరింది. కుక్క‌ను చంపేందుకు దాన్ని మెడ ప‌ట్టింది చిరుత‌.

అప్ర‌మ‌త్త‌మైన వీధి కుక్క గ‌ట్టిగా కేక‌లు వేసింది. చుట్టుప‌క్క‌ల ఉన్న కుక్క‌లు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఐక్య‌మ‌త్యంగా ఓ నాలుగైదు కుక్క‌లు క‌లిసి చిరుత పులితో పోరాటం చేశాయి. చిరుత‌ను ఎదురించాయి. దాని దాడిని త‌ట్టుకోని బాధిత కుక్క ప్రాణాల‌ను మిగ‌తా కుక్క‌లు కాపాడాయి. గ్రామ సింహాల తెగువ ముందు చివ‌ర‌కు చిరుత తోక ముడిచింది. చిరుత‌ను గ్రామ పొలిమేర్ల వ‌ర‌కు గ్రామ సింహాలు త‌రిమికొట్టాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. వీధి శున‌కాల ఐక్య‌మ‌త్యాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. గ్రామ సింహాలు నిజ‌మైన‌ సింహాలాగానే పోరాటం చేశాయ‌ని కొనియాడుతున్నారు.