విధాత : బిగ్ సెలబ్రిటీగా సినీ నటి సన్నిలియోన్ (Sunny Leone)కు ఉన్న క్రేజ్ చెప్పక్కరలేదు. ఈ మాజీ పోర్న్ స్టార్ భారత్ లో పలు భాష సినీ నటిగా కూడారాణిస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ హాట్ బ్యూటీ ఓ రైతు పొలానికి కాపలా( crop scarecrow) ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా దిష్టి బొమ్మ రూపంలో మరి. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే పొలానికి దిష్టిబొమ్మలా ఉన్నది స్వయంగా సన్ని లియోన్ కాదు…ఆమె రూపంతో కూడిన దిష్టి ఫ్లెక్సీ.
కర్ణాటక రాష్ట్రం ముదనూరులో ఓ రైతు వినూత్న చర్య(farmers scarecrow idea) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రైతు తన పొలానికి దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీతో దిష్టిబొమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తన పత్తి పొలానికి దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నానని, అప్పుడు చూసే వారి దృష్టి నా పొలం మీద కాకుండా ఆ ఫ్లెక్సీ మీదకు పోతుందని ఆ రైతు చెప్పుకొచ్చాడు. గతంలోనూ రైతులు తమ పొలాల్లో ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీల ఫోటోలతో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. గతంలోనూ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని హండికనాలలో దీపక్ అనే రైతు తన టామాటా తోటలో ఇలాగే సన్నిలియోన్ ఫ్లెక్సీతో దిష్టిబొమ్మ పెట్టాడు. వరంగల్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఓ రైతు కూడా తన మిరప తోటలో దిష్టిబొమ్మగా సన్నిలియోన్ బికినీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన రైతు అంకినపల్లి చెంచురెడ్డి అనే రైతు కూడా సన్నీ లియోన్ దిష్టిబొమ్మ ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చూస్తే సినిమాల్లో కంటే పొలాల్లోనే సన్నిలియోన్ కు ఎక్కువ క్రేజ్ ఉన్నట్లుందని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Forget scarecrows, this farmer’s gone full Bollywood. 📷 A Karnataka farmer put up a banner with Sunny Leone’s photograph next to his cotton field; he told TOI the poster gets more attention than his good harvest. Talk about a nazar shield🪬#Karnataka #SunnyLeone #Nazar… pic.twitter.com/W5CtM18iX4
— Spot On (@Spotnews_media) December 3, 2025
