వారంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది

  • Publish Date - April 16, 2024 / 10:14 PM IST

చెబుతానన్న యోగా గురు, బాలకృష్ణ
న్యూఢిల్లీ : బాబా రాందేవ్, పతాంజలి సంస్థ ఎమ్ డి బాలకృష్ణపై మంగళవారం సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంత జరిగిన తరువాత మిమ్ములను వదిలేది లేదని హెచ్చరించింది. చేసిన తప్పులను అంగీకరిస్తూ వారం రోజులలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. పతాంజలి కంపెనీ గతంలో జారీ చేసిన వాణిజ్య ప్రకటనలు అలోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. తమ కంపెనీ తయారు చేసిన కరోనిల్‌ కొవిడ్‌ వైరస్‌కు తగిన నివారిణిగా ప్రచారం చేసుకుంది. ఇటువంటి ప్రకటనలు జారీ చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన కేసులో ఇప్పటికే క్షమాపణలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణకు బాబా రాందేవ్, బాలకృష్ణ హాజరైనారు. తాము బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది.

Latest News