King Cobra | షాకింగ్.. నాగుపామును మింగిన మ‌రో నాగుపాము

  • Publish Date - April 13, 2024 / 07:34 AM IST

King Cobra | ఈ భూమ్మీద అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పాము ఏదైనా ఉందా..? అంటే అది నాగుపాము. ఈ పాము అత్యంత విష‌పూరిత‌మైన‌ది. కింగ్ కోబ్రాగా పిలువ‌బ‌డే ఈ పాము కాటేస్తే.. క్ష‌ణాల్లో ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. అంత‌టి విష‌పూరిత‌మైన పామును చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. మ‌రి అలాంటి భ‌యంక‌ర‌మైన నాగుపాము.. మ‌రో నాగుపామును మింగేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వాన్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం ఓఫియోఫాగ‌స్ హ‌న్నా. ఇది గ్రీకు ప‌దం నుంచి ఉద్భ‌వించింది. అర్థం ఏంటంటే.. స్నేక్ ఈటింగ్ అని ఆయ‌న రాసుకొచ్చారు.

నేచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియం ప్ర‌కారం.. విష‌పూరిత‌మైన కింగ్ కోబ్రా ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన పాము. చాలా వ‌ర‌కు నాగుపాములు 12 ఫీట్ల వ‌ర‌కే పెరుగుతాయి. కానీ కొన్ని కోబ్రాలు 18 ఫీట్ల వ‌ర‌కు కూడా పెరుగుతాయి. కింగ్ కోబ్రాలు అధికంగా ఆసియా ఖండంలో క‌నిపిస్తాయి. మ‌రి ముఖ్యంగా ఇండియాలో. ఇక దక్షిణ చైనాలో ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ పాము ఒక్క‌సారి క‌రిస్తే విడుద‌ల‌య్యే విషంతో 20 మంది వ‌ర‌కు చ‌నిపోయే అవ‌కాశం ఉంటుంది. లేదా ఒక ఏనుగు చ‌నిపోవ‌చ్చు. ఇక నాగుపాములు ప్ర‌ధానంగా చిన్న‌చిన్న క్షీర‌దాల‌తో పాటు ప‌క్షుల‌ను తింటాయి. నాగుపామును ముంగీస అమాంతం తినేస్తుంది.

Latest News