కాంగ్రెస్‌కు గాని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కానీ.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… ‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే. మీకు వచ్చిన సమస్య ఏమిటి అని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోనే చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోడీ మళ్లీ ప్రధానిగా రావాలన్నారు. గత ఎన్నికల్లో మీరు 18 సీట్లు ఇచ్చారు. ప్రతిగా ప్రధాని రామ మందిరం తీసుకొచ్చారు. ఈసారి 35 సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపేస్తారని హామీ ఇచ్చారు.
తన ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించిన మమతాబెనర్జీ సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు. బీజేపీకి ఓటు వేయండి. అప్పుడు దీదీ గుండాలు తలకిందులుగా వేలాడుతారు అని అమిత్ షా అన్నారు.
వాళ్లకు పౌరసత్వం ఇస్తే మీకు సమస్య ఏమిటి? అమిత్ షా
కాంగ్రెస్‌కు గాని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కానీ.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు

Latest News
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు
కంచర్ల వర్సెస్ గుత్తా అమిత్ మాటల యుద్దం
మెస్సీ రాక కోసం క్రీడాభిమానులు ఎదురు చూపులు
పంచాయతీ ఎన్నికల పోలింగ్.. సమయం ముగిశాక భారీగా క్యూలైన్లు
సిగరెట్ మానేయకపోతే నో కిస్..
లోక్ సభలో ఈ-సిగరెట్ దుమారం
మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరుల సరెండర్
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు తెలంగాణ వ్యక్తి నామినేట్
వెండి పరుగు..రూ.2లక్షల 9వేలు