విధాత : వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టు పార్టీకి బుధవారం రోజు మరో బిగ్ షాక్ ఎదురైంది. అటు మహారాష్ట్రలో సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ముందు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మరో 60మంది పీఎల్ జీఏ సాయుధ సభ్యులతో లొంగిపోయారు. అదే సమయంలో అటు చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మరో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే రోజున చత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లాలో మరో 50మంది మావోయిస్టులతో ఆయుధాలతో సహా లొంగిపోవడం సంచలనం రేపింది. దీంతో ఒక్క రోజునే అగ్ర నేతలతో సహా 138 మంది మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.
కాంకేర్ జిల్లా అంతాఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 50 మంది మాడ్ డివిజన్ కమిటీ మావోయిస్టులు 40 ఆయుధాలతో పాటు లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు రాజ్మాన్, రాజు సలాంల ఆధ్వర్యంలో 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం విశేషం. లొంగిపోయిన వారందరిపై దాదాపు రెండున్నర కోట్ల రూపాయల రివార్డు ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు లొంగిపోయిన మావోయిస్టు నేతలు రాజు సలాం, రాజ్మాన్ లపై చెరో రూ.25 లక్షల రివార్డు ఉంది. 10 మందిపై రూ.8 లక్షలు, మరో 20 మందిపై రూ.5లక్షల చొప్పున రివార్డు ఉందని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యేక బస్సు ద్వారా అంతాఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ క్యాంపుకు తరలించారు. నిన్న సాయంత్రం నుండి రాజు సలాం, రాజ్మాన్ ల ఆధ్వర్యంలో లొంగిపోయేందుకు సంప్రదింపులు కొనసాగాయి. పోలీసులతో సంప్రదింపులు సఫలం కావడంతో ఆయుధాలతోపాటు 50 మంది మావోయిస్టులు