Site icon vidhaatha

Pune Accident : పూణేలో విషాదం.. వ్యాన్ లోయలో పడి 10 మంది మృతి!

tragic-pune-accident-10-women-killed-27-others-injured-as-truck-falls-down

Pune Accident | న్యూఢిల్లీ : పూణేలో వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 10మంది దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో దాదాపు 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్ తహశీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంలో నియంత్రణ కోల్పోవడంతో 30అడుగుల లోతులోని లోయలోకి వ్యాన్ దూసుకెళ్లింది. ప్రమాద బాధితుల్లో పపల్ వాడి గ్రామస్తులతో పాటు ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు.

పూణే ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
పూణే వ్యాన్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో కూలీ, వార్-2 సినిమాల టికెట్ ధరల పెంపుపై రచ్చ..?

అవ‌కాడో న‌ర్స‌రీ.. 6 నెల‌ల్లోనే రూ. 50 ల‌క్ష‌లు సంపాదిస్తున్న అకౌంటెంట్

Exit mobile version