Avocado Nursery | కరోనా( Corona ) ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తే.. కొంతమంది జీవితాల్లో మాత్రం వెలుగులు నింపింది. ఆ కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు.. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారు తమ సమయాన్ని వృథా చేయకుండా.. వినూత్నంగా ఆలోచించి.. ఇప్పుడు కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారు. ఓ అకౌంటెంట్( Accountant ) కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. అవకాడో నర్సరీ( Avocado Nursery ) ని ఏర్పాటు చేసి, మొక్కలు విక్రయించడం ప్రారంభించాడు. ఇప్పడు ఆరు నెలల కాలానికి రూ. 50 లక్షలు సంపాదిస్తూ నేటి యువ రైతులకు( Young Farmers ) ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి యువ రైతుగా మారిన ఆ అకౌంటెంట్ గురించి తెలుసుకోవాలంటే కర్ణాటక( Karnataka ) వెళ్లాల్సిందే.
కర్ణాటకలోని మైసూర్( Mysuru ) ప్రాంతానికి చెందిన హర్షిత్ బీఎస్( Harshith BS ) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కామర్స్( Commerce ) బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఓ ప్రయివేటు కంపెనీలో అకౌంటెంట్( Accountant )గా చేరాడు. మంచి జీతం కూడా. అయితే కరోనా సమయంలో హర్షిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంటి వద్దే ఏదైనా చిన్న బిజినెస్ చేద్దామని ఆలోచించసాగాడు.
ఈ క్రమంలో సెర్చ్ చేస్తుండగా.. ఇండియాలో డిమాండ్ అధికంగా ఉన్న అవకాడో పండ్ల( Avocado Fruits )పై అతని దృష్టి పడింది. కానీ అతను కామర్స్ బ్యాక్ గ్రౌండ్ కావడంతో.. అగ్రికల్చర్( Agriculture )పై అంతగా పట్టులేదు. దీంతో అగ్రికల్చర్ సెక్టార్‌లో మరింత నైపుణ్యం సాధించేందుకు అగ్రికల్చర్‌లో డిప్లొమా కోర్సు చేయాలనుకున్నాడు. ఇక బెంగళూరుకు సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హర్టికల్చరల్ రీసెర్చ్( IIHR ) సెంటర్‌లో డిప్లొమాలో అడ్మిషన్ తీసుకున్నాడు. అక్కడ అవకాడో నర్సరీ, దాని సాగుపై అవగాహన పెంచుకున్నాడు.
తొలి ప్రయత్నంలో రూ. 5 లక్షల ఆదాయం..
ఇక కోర్సు పూర్తయిన అనంతరం.. తనకున్న 2 వేల చదరపు అడుగుల్లో అవకాడో నర్సరీ మొక్కలను పెంచడం ప్రారంభించాడు. గ్రాఫ్టింగ్( Grafting ) కూడా చేయడం ప్రారంభించాడు. దీంట్లో కూడా అతను సక్సెస్ అయ్యాడు. 2020లో రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి అవకాడో విత్తనాలను, ఈ నర్సరీ సాగుకు కావాల్సిన మెటిరీయల్‌ను కొనుగోలు చేసి 10 వేల అవకాడో మొక్కలను పెంచాడు. ఈ మొక్కలకు గ్రాఫ్టింగ్ చేశాడు. ఆ తర్వాత ఒక్కో మొక్కను రూ. 100కు రైతులకు విక్రయించాడు. దీంతో రూ. 10 లక్షల ఆదాయం సమకూరింది. ఖర్చులు పోను రూ. 5 లక్షలు మిగిలాయి. ఇక అప్పట్నుంచి తాను తిరిగి చూడలేదు.. తన బిజినెస్ ఎంతో అభివృద్ధి చెందిందని హర్షిత్ తెలిపాడు.
2024లో రూ. 50 లక్షల ఆదాయం…
ఆ తర్వాత ఎకరా పొలంలో పాలీహౌజ్ నర్సరీ( Polyhouse Nursery ) ఏర్పాటు చేశాడు హర్షిత్. ప్రస్తుతం తన నర్సరీ నుంచి ఏడు రకాల అవకాడో మొక్కలను విక్రయిస్తున్నాడు. ఇందులో మూడు ఇండియన్ వెరైటీస్ ఉన్నాయి. ఇక 2021లో 20 వేల మొక్కలను విక్రయించాడు. 2024 నాటికి 50 వేల మొక్కలను విక్రయించే స్థాయికి ఎదిగాడు. రూ. 50 లక్షలు సంపాదించాడు. అంటే ఒక్కో మొక్కను రూ. 100 విక్రయించాడు. ఆరు నెలల ముందే హర్షిత్‌కు అడ్వాన్స్ ఇస్తున్నారు రైతులు.
ఈ ఏడాది లక్ష మొక్కలు విక్రయించేందుకు ప్లాన్
అవకాడో విత్తనాన్ని నాటిన తర్వాత.. అది వేరుగా రూపాంతరం చెంది మొక్కగా ఎదిగేందుకు రెండు నెలల సమయం పడుతుంది. గ్రాఫ్టింగ్ చేశాక నాలుగు నెలలకు మొక్కను నాటేందుకు విక్రయిస్తారు. అంటే అవకాడో విత్తనం మొక్కగా రూపాంతరం చెందేందుకు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ ఆరు నెలల్లోనే 50 వేల మొక్కలు విక్రయించి.. రూ. 50 లక్షలు సంపాదించాడు హర్షిత్. ఖర్చులు పోను రూ. 25 లక్షల ఆదాయం మిగిలిందని హర్షిత్ తెలిపాడు. అవకాడో మొక్కలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాల రైతులకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఏడాది లక్ష మొక్కలను విక్రయించేందుకు ప్రణాళికలు రచించినట్లు స్పష్టం చేశాడు హర్షిత్.