Medical student Gang-Raped In West Bengal | బెంగాల్ లో మరో మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం

పశ్చిమ బెంగాల్‌లోని శోభాపూర్ మెడికల్ కాలేజీలో ఒక ఒడిశా విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఆమె వద్ద నుండి మొబైల్ ఫోన్, నగదు లాక్కున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Medical student from Odisha gang-raped in West Bengal

న్యూఢిల్లీ : పశ్చిమ మరో మెడికల్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం రాత్రి తన మిత్రుడితో కలిసి రాత్రి 8 గంటలకు పానిపూరి తినేందుకు బయటకు వెళ్తుండగా.. క్యాంపస్ గేటు వద్ద ఉన్న ఐదుగురిలో ఓ వ్యక్తి ఆమెను నిర్మానుష్య ప్రాంతాంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్ధినినీ కొట్టి ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.3వేల నగదు లాక్కున్నాడు. మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

గత సంవత్సరం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మౌమితా దేబ్‌నాథ్‌పై జరిగిన దారుణ హత్యాచారం మరువకముందే మరో జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురవ్వడం సంచలనం రేపింది. ఆర్ జీ కర్ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమై, నిందితులకు జీవిత ఖైదు విధించారు. అయినప్పటికి మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. బెంగాల్‌లో ఏం జరుగుతోంది? అక్కడి ఆసుపత్రులు ఎందుకు నేర ప్రాంతాలుగా మారుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులలో సిబ్బందిని ఎందుకు రక్షించుకోవడంలో విఫలమవుతోందన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నుంచి బలంగా వినిపిస్తున్నాయి.