White Cobra | పాములు( Snakes ) సాధారణంగా దట్టమైన అడవుల్లో, చెట్ల పొదల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అప్పుడప్పుడు జనవాసాల మధ్య కూడా ప్రత్యక్షమవుతూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంటాయి. కానీ ఈ పాము మాత్రం నల్లటి బొగ్గు గనుల్లో( Coal Mines ) ప్రత్యక్షమైంది. అదేదో సాధారణ పాము కాదండోయ్.. అది శ్వేతనాగు( White Cobra ). ఆ బొగ్గు గనుల్లో ఈ తెల్లటి శ్వేతనాగు మెరిసిపోయింది. శ్వేతనాగును చూసిన కార్మికులు షాకయ్యారు. తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ శ్వేతనాగును బంధించి సోషల్ మీడియాలో వైరల్ చూశారు. ఇక శ్వేతనాగు.. పరుగు పెట్టిన దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది.
తమిళనాడు( Tamil Nadu )లోని నైవేలీ బొగ్గు గనుల్లో( Neyveli coal mines ) ఈ శ్వేతనాగు ప్రత్యక్షమైనట్లు వీడియోపై రాసి ఉంది. ఈ పాము 15 ఫీట్ల పొడవు ఉన్నట్లు పేర్కొన్నారు. నైవేలీ బొగ్గు గనుల ప్రాంతం చుట్టు దట్టమైన అడవి ఉందని తెలిసింది. ఆ అడవిలోంచి దారితప్పి వచ్చిన శ్వేతనాగు గనుల్లోకి వెళ్లి ఉంటుందని కొంత మంది భావిస్తున్నారు. కాగా, వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నమైన కామెంట్స్ చేశారు. కొందరు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తుండగా, మరికొందరు అరుదుగా ఉండే శ్వేత నాగు కనిపించటం వారి అదృష్టంగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ బొగ్గుగనిలో శ్వేతనాగు కనిపించడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి శ్వేతనాగుపై.