Site icon vidhaatha

లేడీ అఘోరీకి 14రోజుల రిమాండ్.. ఆడో మగో తేల్చాకే జైలుకు..!

విధాత: పూజల పేరుతో చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ కు చేవెళ్ల కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అఘోరీ ఇటీవల పెళ్లి చేసుకున్న వర్షిణీని భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. వర్షిణీని పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ ఇక తాము తెలుగు రాష్ట్రాలకు రానంటూ కేదారినాథ్ వెలుతామని అదృశ్యమయ్యాడు. అయితే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. ఈకేసులో భాగంగా అఘోరీని మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోర్టులో రిమాండ్ చేశారు.

6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన బాధిత మహిళకు అఘోరి పరిచయం అయ్యింది. ఈ సందర్భంగా తన సమస్యలను మహిళ అఘోరీకి వివరించగా.. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాన్స్ గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది. ఈ నేపథ్యంలో తాను మోసపోయానని గ్రహించి మహిళ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆడో మగో తేల్చాకే జైలుకు..!

చీటింగ్ కేసులో అరెస్టయి 14రోజుల రిమాండ్ విధించబడిన లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్ లో ఉంచలేమని జైలు అధికారులు అఘోరీని తిరిగి పంపించారు. లింగ నిర్ధారణ జరిగితేగాని ఇక్కడ ఉంచుకోలేమంటూ చెప్పిన జైలు అధికారులు పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు తల పట్టుకోవాల్సి వచ్చింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ముందని సమాచారం.

Exit mobile version