Viral | Peacock
విధాత: అబ్బాయిలు అమ్మాయిలను లవ్ లో పడేసేందుకు పడే తిప్పలు అన్ని ఇన్ని ఉండవు. మనుషుల్లోనే కాదు.. పశు, పక్షాదులు కూడా జత కోసం పడే పాట్లు గమ్మత్తుగా ఉంటాయి. ఓ ఆడ నెమలిని ఆకర్షించేందుకు మగ నెమలి చేసిన విన్యాసం పర్యాటకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధరణంగా మగ నెమళ్లు ఆడ నెమలిని ఆకర్షించేందుకు తన పొడవైన రంగు రంగుల రెక్కలను పురి విప్పి ఆడుతూ రకరకాల ధ్వనులు చేస్తూ ఆడ నెమలిని ఆకర్షిస్తుంటాయి. ఇలాగే ఓ మగనెమలి రెక్కలు విప్పి ఆడ నెమలి ముందు నన్న చూడు నా గొప్ప చూడు అంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన విన్యాసాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆడ నెమలి పట్టించుకోకుండా ముందుకెళ్లగా..మగ నెమలి మళ్లీ మళ్లీ దాని ముందుకెళ్లి అదే విన్యాసాలు చేస్తూ దాని ప్రేమకోసం తిప్పలు పడింది.
లవర్ కోసం నెమలి విన్యాసాలు #viral pic.twitter.com/2koJsASua4
— srk (@srk9484) April 22, 2025
ఆ సమయంలో ఆ పార్కుకు వచ్చిన సందర్శకులు వాటి చుట్టు చేరి ఫోటోలు తీస్తున్నప్పటికి వారిని పట్టించుకోకుండా మగ నెమలి పట్టు వీడకుండా దృష్టి మరల్చకుండా ఆడ నెమలి ముందు తన ప్రేమ ప్రయత్నాలు కొనసాగించింది. ఇది చూసిన సందర్శకులు ఇదేమి ప్రేమ పాట్లురా బాబు అనుకుంటూ ఆసక్తిగా చూశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇది చూసిన నెటిజన్లు నెమళ్లపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ ..సారీ! నీకు సొంత ఇల్లులేదు, కారు లేదు. ఇలాంటి వేషాలకు అమ్మాయిలు పడే రోజులు పోయాయి..ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్! కనీసం పచ్చడిమెతుకులతో పెళ్ళాన్ని పోషించగలవ్ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం అమోఘం అంటూ కామెంట్స్ చేశారు.