Site icon vidhaatha

TTD చైర్మన్‌ బీఆర్ నాయుడిపై.. న్యాయవాది సుబ్రమణ్య స్వామి ఫైర్

విధాత: తిరుమలలోని టీటీడీ గోశాలలో గోవుల మృతి వ్యవహారం ఏపీలో అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తిరుమల గోశాలలో ఏప్రిల్ 2024 నుంచి మే 2025 వరకు 191 గోవులు చనిపోయినట్టు తెలిపిన టీటీడీ గో సంరక్షణ కేంద్రం వెల్లడించింది. టీటీడీ నిర్లక్ష్యంగానే గోశాలలో గోవులు వరుసగా చనిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు ఖండించారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులు కూడా చనిపోతున్నాయంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు బీఆర్ నాయుడిని మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. గోవుల మరణాలపై బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. బీఆర్. నాయుడు వ్యాఖ్యలపైన..తిరుమల గోశాల గోవుల మరణాలపైన కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులు కూడా చనిపోతున్నాయి అని మాట్లాడటం చాలా దారుణమని సుబ్రమణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మీరు కూడా చనిపోతారని.. అప్పుడు వయసు మళ్లారని మిమ్మల్ని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా? అని సుబ్రమణ్యం స్వామి ప్రశ్నించారు.

Exit mobile version