విధాత: పదహారేళ్ల తర్వాత మలయాళ సినిమా ఇండస్ట్రీలో అరుదైన కాంబినేషన్ పట్టాలెక్కుతోంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. చివరిగా 2008లో ట్వంటీ ట్వంటీ అనే చిత్రంలో నటించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి నటిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటి వరకూ ఈ కాంబోలో 49 చిత్రాలు రాగా, 50వ చిత్రం షురూ అయింది. ఈ సినిమాకు మహేశ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తోండగా ఫహద్ ఫాజిల్, కుంచకోబోబన్, నయనతార, దర్శణ రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీలంకలో ప్రారంభమవగా విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చిన్, అబుదాబి, అజర్ బైజాన్‌లలో 150 రోజుల పాటు జరగనుంది.