Site icon vidhaatha

LRS | ఈ నెల 3వ తేదీ వరకు LRSకు చాన్స్ !

విధాత : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌(ఎల్ ఆర్ఎస్) వన్ టైమ్ సెటిల్ మెంట్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ధఫా కేవలం మూడు రోజుల పాటు అంటే ఈ నెల 3వ తేదీ వరకు మాత్రమే పొడిగించడం గమనార్హం. రాష్ట్రంలో అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం తీసుకొచ్చింది. 2020నుంచి 25,67,107దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా..వాటిలో గతేడాది 8లక్షల వరకు పరిష్కరించారు. మిగతా వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం తెచ్చింది. దీంతో భారీగా ఎల్ఎఆర్ఎస్ దరఖాస్తులు వస్తాయని ఆశించింది. తొలి గడువు మార్చితో ముగిసిపోగా ఏప్రిల్ నెలాఖరుదాకా పొడిగించారు. భారీ ఎత్తున పెండింగ్ దరఖాస్తులు ఉండటంతో మరోసారి మూడు రోజుల పాటు గడువు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ టీకే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version