Site icon vidhaatha

BRS నుంచి.. కవిత సస్పెండ్‌కు రంగం సిద్ధం

విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపించేందుకు రంగం సిద్ధమైందని..నేడో రేపో కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తో కలిసి గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందన్నారు. బీఆర్ఎస్ కు సంతోష్ రావును ప్రెసిడెంట్ గా చేసే అవకాశముందని చెప్పారు.

కేసీఆర్ పరిస్థితి తమిళనాడు మాజీ సీఎం జయలలిత లాగా తయారైందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి..ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశానని తాను పది రోజుల ముందే చెప్పానని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు నేడో, రేపో కవితను సస్పెండ్ చేస్తారని చెబుతున్నానన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేకమందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కవితకి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోనుందని చెప్పారు. కవిత చెప్పిన కేసీఆర్ చుట్టు ఉన్న దెయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులేనన్నారు.

కేసీఆర్ తో కవిత మాట్లాడతా అంటే సంతోష్ అడ్డుకున్నాడని.. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ డిసైడ్ చేస్తున్నారని సామా పేర్కొన్నారు. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ డబ్బులు తీసుకుంటాడని..తండ్రి,బిడ్డల మధ్య ఇంత గ్యాప్ సృష్టించిన దయ్యం ఎవరు? అని ఆయన మండిపడ్డారు. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్ కి లేదన్నారు. సొంత మనుషులే కేసీఆర్ ను వెన్నుపోటు పొడుస్తారని..కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కేటీఆర్ పార్టీలో జరుగుతున్న వివక్షపై స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇస్తున్న కేటీఆర్ వాళ్ల పార్టీ గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు.

Exit mobile version