విధాత,అమరావతి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు . విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్,చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి.ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది.కే.రంగయ్య,పయ్యావుల రామస్వామి బెస్ట్ టీచర్స్ గా ఎంపికయ్యారు.