Site icon vidhaatha

Viral: రోడ్డుపై.. మంచం ప‌రుగులు! క‌ట్ చేస్తే (Video)

విధాత: కార్లు, బైక్ లు..బస్సులు..ఇతర వాహనాలు రోడ్లపై పరుగులు తీయడం అందరికి తెలిసిందే.. అయితో ఇళ్లలో పడక గదిలో ఉండే మంచం రోడ్లపై పరుగులు తీస్తున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పడక మంచం కాస్తా కారు..బస్సులా రయ్ రయ్ మని రోడ్డుపై దూసుకెలుతున్న దృశ్యాలు చూసిన జనం ఇదేక్కడి చోద్యంరా నాయనా అనుకుంటు జుట్టు పీక్కుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తను పడుకునే మంచాన్ని అవసరమైన చోటుకు తీసుకెళ్లాలనే ఆలోచననో ఇంకేదో గాని తన మంచాన్ని కారులా మార్చేసి దానిపై ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతున్నాడు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో చోటుచేసుకున్న ఈ వింత వాహనం అందరిని అశ్చర్యానికి గురి చేస్తుంది.

శంభునగర్ కు చెందిన నవాబ్ అనే వ్యక్తి త‌న భార్య నగలు అమ్మేసి మ‌రీ మంచాన్ని కారులా మార్చేసి రోడ్డుపై చక్కర్లు కొడుతున్నాడు. దిండ్లు, పరుపు, దుప్పట్లతో కూడిన తన పడక మంచం వాహనంపై నవాబ్ రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే అది చూసేందుకు వాహనదారులు దాని వెంట పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తెలుగు సినిమా భైరవ ద్వీపంలో నిద్రిస్తున్న రాకుమారితో రాజకోట నుంచి మాంత్రికుడి గుహకు ఆకాశ మార్గాన వెళ్లే మంచంను తలపించింది.

అంతేకాదు నవాబ్ పడక మంచం కారు కొంచెం అటు ఇటుగా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడకల్లో ప్రదర్శించే శకటాల మాదిరిగా..లేక ఇంజన్ నిర్మాణం పూర్తయ్యి బాడీ నిర్మాణానికి కంపెనీలకు వెళ్లే రోడ్డు మీదుగా వెళ్లే సగం బస్సులు, డీసీఎంలు, లారీల వాహనాల మాదిరిగా మనోడి మంచం కనిపిస్తుంది. ఏదీ ఏమైన నవాబ్ నయా ఆలోచనకు జనం ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ వింత వాహనాన్ని చూసిన జనం, పిల్లలు, రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యం, విస్మయంతోనే నవాబ్ వినూత్న వాహన ఆవిష్కరణను కేరింతలతో అభినందిస్తున్నారు. ఇదిలాఉండ‌గా మంచం వాహానం త‌యారు చేసి రోడ్ల‌పై ప్ర‌యాణించి ట్రాఫిక్ కి అడ్డంకులు కలిగించాడంటూచివ‌ర‌కు న‌వాబ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం కొస‌మెరుపు.

Exit mobile version