హీరోగా మంచి గుర్తింపే ఉన్నప్పటికీ సుమారు రెండు మూడేండ్లు తెలుగులో ఏ సినిమాలో కనిపించకుండా ఉన్న నటుడు. బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). ఇంతకుముందు అతను నటించిన అల్లుడు శీను, సాక్ష్యం, జయజానకీ నాయక ,రాక్షసుడు సినిమాలతో తనకంటూ ఓ మార్కెట్ సృష్టించుకున్న ఈ హీరో గత సంవత్సరం ఛత్రపతి హిందీ రిమేక్ మోజులో పడి మూడేండ్లు ఇక్కడి సినిమాలకు దూరమయ్యాడు. తీరా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తిరిగి తన అఫ్‌కమింగ్ సినిమాలపై దృష్టి సారించాడు. ఈనేపథ్యంలో వరుసగా అర డజన్ చిత్రాలను లైన్‌లో పెట్టగా అందులో ఓ చిత్రం భైరవ త్వరలో విడుదలకు సిద్ధమైంది. మిగతావి శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా మూడు సినిమాలను ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మంచు మనోజ్, నారా రోహిత్‌లతో కలిసి మల్టీ స్టారర్‌గా తమిళ హిట్ చిత్రం గరుడ సినిమాకు రీమేక్‌గా చేస్తున్న భైరవ ఈ నెల చివరలో విడుదల అవుతుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు.
ఇక ఇదే కాక పిరియాడికల్, మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఓ చిత్రం టీజర్‌ను రీసెంట్‌గా విడుదల చేయడమే కాక మూవీ పేరును హైందవ (Haindava)గా ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గతంలో మన తెలుగులో రానటువంటి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ టీజర్‌లో పలువురు దుండగులు ఓ అలయాన్ని తగలబెట్టాలని చూస్తుండగా హీరోతో పాటు విస్ణుమూర్తి దశావతారాలు ఒక్కసారే అప్రమత్తై ఆ దేవాలయాన్ని రక్షించేందుకు పరిగెత్తడం, చివరకు విష్ణు నామాలు దర్శణమివ్వడం వంటి ఆసక్తికర పాయింట్లతో అద్యంతం చాలా ఇంట్రెస్టింగ్‌గా టీజర్ సాగింది. ఈ సినిమాకు లూథీర్ బైరెడ్డి (Ludheer Byreddy) దర్శకత్వం వహించగా మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చండు నిర్మించగా సంయుక్తీ మీనన్ కథానాయికగా చేస్తోంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టీజర్ చూసినవారంతా ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది, అసలేం ఫ్లాన్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో మేకర్స్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా విజువల్స్, థీమ్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి.. ఈసారి బెల్లంకోండ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉన్నాడంటూ సినీ లవర్స్ చాలామంది సోషళ్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు ఇంకా చూడకుంటే ఇప్పుడే చూసేయండి. కాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ థియేటర్లలో విడుదల కానుంది.