విధాత, హైదరాబాద్: అపర్ణా నియో మాల్‌లో జరుగుతున్న NEOSS షాపింగ్ ఫెస్టివల్లో ఆదివారం సెలబ్రిటీ షో జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులతో మాల్ మొత్తం సందడిగా మారిపోయింది. పాటలు, డ్యాన్స్‌లతో షాపింగ్ ఫెస్టివల్ మరింత కళను సంతరించుకుంది.
ఆగస్టు 17 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో షాపింగ్ చేసేవారికి బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాలు ఉన్నాయి. ₹1,000 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినవాళ్లు లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఇక ముందు కూడా ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆగస్టు 14-15 తేదీల్లో జానపద నృత్యాల ఫెస్టివల్ (Folk Dance Fest), ఆగస్టు 16న అద్భుతమైన శాండ్ ఆర్ట్ ప్రదర్శన (Sand Art performance) వంటివి ఈ ఈవెంట్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సిటీలో జరుగుతున్న అత్యంత డైనమిక్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌గా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.