బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి సోకదు

విధాత:ఒక రకమైన ఫంగస్{ బూజు }శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .ఇది పుట్టగొడుగు జాతికి చెందిన శిలీన్ద్రము.గాలిలో ఉంటుంది .ఇంకా ఆకులు, చిత్తడి నేల, కంపోస్ట్ , తడిచి ముద్దై న కొయ్యలు మొదలైన వాటి పై ఉంటుంది .గాలి పీల్చుకొన్నప్పుడు లేదా ఒంటిపైన ఉన్న గాయాల ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తుంది .శరీరంలో ఇలాంటి ఫంగస్ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి లోని రోగనిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి చంపేస్తుంది.కానీ రోగ నిరోధక వ్యవస్థ […]

  • Publish Date - May 27, 2021 / 09:15 AM IST

విధాత:ఒక రకమైన ఫంగస్{ బూజు }శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .ఇది పుట్టగొడుగు జాతికి చెందిన శిలీన్ద్రము.గాలిలో ఉంటుంది .ఇంకా ఆకులు, చిత్తడి నేల, కంపోస్ట్ , తడిచి ముద్దై న కొయ్యలు మొదలైన వాటి పై ఉంటుంది .గాలి పీల్చుకొన్నప్పుడు లేదా ఒంటిపైన ఉన్న గాయాల ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తుంది .శరీరంలో ఇలాంటి ఫంగస్ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి లోని రోగనిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి చంపేస్తుంది.కానీ రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టం బలహీనంగా ఉన్న వారిలో ఇది శరీరం లో చెలరేగిపోతుంది . అప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యాధి గ్రస్తుడు అవుతారు .

ఎలాంటి వ్యక్తులకు ఇది వ్యాధిగా మారుతుంది ?: ఇలాంటి ఫంగస్ గాలిలో ఉంది. పొలాల గట్టుల్లో, భవన నిర్మాణాల్లో పని చేసే వారు నిరంతరం దీని బారిన పడుతుంటారు . అలాంటి వారి శరీరంలోకి ఇది ప్రవేశిస్తుంది . కానీ వారి శరీరంలో ని రోగనిరోధక వ్యవస్థ చేతిలో చచ్చిపోతుంది . ఇది ఎన్నో యుగాలుగా జరుగుతున్నదే .
మరి ఇప్పుడు ఇది ఒక వ్యాధిగా ఎందుకు మారింది ?
ఫంగస్ శరీరంలో ప్రవేశించిన ప్రతి వారు వ్యాధి గ్రస్తులు కారు . ఆలా జరిగి ఉంటే ఇప్పటికి భూప్రపంచం పై ఒక్క మనిషి కూడా మిగిలే వాడు కాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆంతరించిపోయి ఉండేది .
మరి ఇప్పుడే ఎందుకు ఇది వ్యాధిగా మారింది ?
నిజానికి ఇది వ్యాధిగా మారడం కొత్త కాదు. బ్లాక్ ఫంగస్ కేసులు గతం లో కూడా ఉండేవి . కానీ ఎక్కడో ఒకటి అరా ఉండేవి . ఇప్పుడు వందల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు అవుతున్నారు . కారణం వ్యక్తుల ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీన పడడం. ఎందుకు ?
. 1 . కాన్సర్ బారిన పడిన వారు , అవయవాల మార్పిడి జరిగిన వారు,తెల్ల రక్త కణాల హీనత వ్యాధి { అంటే తెల్ల రక్త కణాలు తక్కువగా ఉండడం }, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు,శరీరం పై తీవ్ర గాయాలు అయిన వారు , అగ్నిప్రమాదం లో చర్మం కాళీ బొబ్బలు ఎక్కిన వారు , నేల తక్కువ పిల్లలు — ఇలాంటి వారికి ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటుంది . ఇలాంటి వారు ఈ వ్యాధి బారిన పడడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే . కాకపోతే ఇలాంటి కేసులు తక్కువ కాబట్టి అప్పుడు అది చర్చనీయాంశం కాలేదు .
ఇప్పుడు ఎందుకు కేసులు పెరుగుతున్నాయి ?
కోవిద్ సోకిన వారికి వ్యాధి తీవ్రతను బట్టి స్టెరాయిడ్ లు ఇవ్వాల్సి ఉంటుంది . పెద్ద నష్టాన్ని నివారించడం కోసం చిన్న నష్టం పరవాలేదు అని సూత్రాన్ని అనుసరించి వైద్యులు స్టెరాయిడ్ ను సూచిస్తారు . కోవిద్ సోకి ఒంటిలో ముఖ్యంగా ఊపిరి తిత్తులు లాంటి భాగాల్లో వాపు బాగా ఎక్కువైనప్పుడు వైద్యులు ఈ మందు వాడమని చెబుతారు . స్టెరాయిడ్ ల వాడకం వల్ల ఇమ్మ్యూనిటి దెబ్బ తింటుంది . అదే విధంగా ఇది కాలేయాన్ని దెబ్బ తీసి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయేలా చేస్తుంది . దీనితో వ్యక్తి రక్తం లో చక్కర శాతం పెరిగి పోతుంది . అవసరం మేర మాత్రమే స్టెరాయిడ్ లు వాడడం , తప్పని సరిగా వాడాల్సి వచ్చినప్పుడు శరీరం లో వచ్చే సైడ్ రియాక్షన్స్ ను గుర్తించి వాటి కోసం చికిత్స చేయడం చేస్తే పెద్దగా సమస్య ఉండదు . ముఖ్యంగా స్టెరాయిడ్ లు వాడిన వ్యక్తుల బ్లడ్ షుగర్ అంటే రక్తం లో చక్కర ను చెక్ చెయ్యాలి.అవసరం మేరకు దాన్ని తగ్గించేందుకు మందులు ఇవ్వాలి .

కానీ కొన్ని చోట్ల అవగాహన లేని వారు వ్యాధి సోకిన తోలి రోజు నుంచే స్టెరాయిడ్ లు వాడేస్తున్నారు . పెద్ద మొత్తం లో స్టెరాయిడ్ లు వాడడం , అది కూడా ఎక్కువ రోజులు వాడడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ చిక్కి శల్యం అయిపోతుంది . దీనితో పాటు స్టెరాయిడ్ లు వాడిన వారు కనీసం తమ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోకపోవడం తో రక్తం లో చక్కర లీవల్స్ ప్రమాదకరంగా పెరిగిపోతాయి . అప్పటి దాక అసలు డయాబెటిస్ లేని వారు కూడా వారం పది రోజులు స్టెరాయిడ్ వాడడం వల్ల చక్కర లెవెల్స్ 300 దాటి ప్రమాదకరంగా మారి పోతాయి . ఇందుకే ఇటీవలి కాలం లో బ్లాక్ ఫంగస్ కేసులు ఇబ్బుడిముబ్బిడిగా పెరిగిపోతున్నాయి