విధాత: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక సమర్పించిన నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తోన్న ‘భారత్ సమ్మిట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై స్పందించారు. కాళేశ్వరం నిర్మాణం చేసిన వారు, చేయించిన వారు రైతులకు ద్రోహం చేశారని చెప్పారు. రైతులకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు రూ.లక్షల కోట్ల ప్రాజెక్టు కట్టారని.. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.వారి హయంలోనే కూలిపోయిందని గుర్తు చేశారు.
ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల నిరూపయోకరంగా మారాయని..అయినప్పటికి రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు. ఎంతసేపు అబద్ధాలు తప్పులపై బతకాలని బిఆర్ఎస్ అనుకుంటుందని..అది కుదరదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎన్‌డీఎస్‌ఏ అనే దానిని రేవంత్‌రెడ్డినో.. నేనో వేసింది కాదు.. దేశంలో అత్యుత్తమ నిపుణులు ఎన్‌డీఎస్‌ఏలో ఉన్నారని గుర్తు చేశారు. కాశేశ్వరం రైతుల కోసం కాదని..వారి జేబుల నింపుకోవడానికి కట్టారని ఉత్తమ్ విమర్శించారు. ఎన్డీఎస్ఏ నివేదికపై అధ్యయనం చేస్తామని.. వచ్చే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటాం’’అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.