Site icon vidhaatha

Thalapathy Vijay | తళపతి విజయ్‌పై.. నార్కోటిక్స్ కేసు న‌మోదు

Thalapathy Vijay |

విధాత‌: కొలీవుడ్‌ టాప్‌ హీరో తళపతి విజయ్ పై కేసు బుక్కెంది. ఇటీవల తన జన్మదినం సందర్బంగా తను నటించిన లియో సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ నాన్‌ రెడీ పాటను విడుదల చేయగా కొద్ది గంటల్లోనే మిలియన్స్‌ వ్యూస్‌ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.

అయితే ఈ పాటలో హీరో విజయ్‌ అసాంతం సిగరెట్టు తాగుతూ కనిపించాడని అది పొగాకు ఉత్పత్తులను ప్రొత్సహించేలా ఉన్నదని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ నార్కోటిక్స్ నియంత్రణ చట్టం సెక్షన్ కింద తమిళనాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ తమిళనాట 10, 12 తరగతుల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి వారితో ఓ రోజంతా గడిపిన హీరో విజయ్‌ ఓ పాట సిగరెట్‌ కాల్చుతూ కనిపించడం పద్ధతిగా లేదని పలువురు భావిస్తున్నారు. అయితే విజయ్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇలాంటి వివాదాలు మొదలవడంపై అయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉండగా లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వస్తుందంటూ మంచి హైప్‌ సంపాదించిన లియో చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ఏర్పడింది. మాస్టర్‌ సినిమా తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌, విజయ్‌ కలిసి చేస్తున్న చిత్రం కావడం, విక్రమ్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సౌత్ ఇండస్టీ అంతా అతృతగా ఎదురుచూస్తున్నది.

Exit mobile version